'10th/ITI పాస్' తో ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో ఉద్యోగావకాశాలు

- November 26, 2019 , by Maagulf
'10th/ITI పాస్' తో ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో ఉద్యోగావకాశాలు

భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేసే సంస్థలలో ఒకటైన ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఉద్యోగ నియామక ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా, దేశవ్యాప్తంగా ఉన్న ఫ్యాక్టరీలలో సుమారు 4805 అప్రంటీస్ పోస్తులని భర్తీ చేయనుంది. అయితే ఇందులో ఐటీఐ, 10th పాస్ అయిన వారు మాత్రమే అర్హులుగా పేర్కొంది. ఉద్యోగ సమాచారంలోకి వెళ్తే..

పోస్టుల సంఖ్య : 4805

ఐటీఐ అర్హత పోస్టులు - 3210

10 th అర్హత పోస్టులు - 1595

అర్హతలు : గుర్తింపు పొందిన ప్రభుత్వ రంగ ఐటీఐ బోర్డుల నుంచీ కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అయ్యి ఉండాలి. దానితో పాటు 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఇక నాన్ ఐటీఐ అభ్యర్ధులు, తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. అలాగే సైన్స్,మ్యాధ్స్ లో తప్పనిసరిగా 40 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

వయస్సు : 15 నుంచీ 24 ఏళ్ళ మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం : ఆన్లైన్

ప్రారంభ తేదీ : డిసెంబర్ 20 -2019

మరిన్ని వివరాలకోసం : www.ofb.gov.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com