ఇండియన్ నేవీలో ఉద్యోగావకాశాలు

- November 26, 2019 , by Maagulf
ఇండియన్ నేవీలో ఉద్యోగావకాశాలు

ఇండియన్ నేవీలో ఉద్యోగం మీ కలా? అర్హత తక్కువ ఉన్నా ఇండియన్ నేవీలో చేరాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం 5 నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసే అవకాశముంది. ఈ 5 నోటిఫికేషన్లతో మొత్తం 1001 జాబ్స్ ఉన్నాయి. ఈ పోస్టులకు విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి. దరఖాస్తు చివరి తేదీలు కూడా వేరుగా ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తగిన అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకొని అప్లై చేయాలి. 10వ తరగతి పాసైనవారికి 400 పోస్టులతో ఓ నోటిఫికేషన్ జారీ చేసింది ఇండియన్ నేవీ. మెట్రిక్ రిక్రూట్ అక్టోబర్ 2020 బ్యాచ్‌లో షెఫ్, స్టివార్డ్, హైజినిస్ట్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తుకు 2019 నవంబర్ 28 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం

కర్నాటకలోని కార్వార్‌లో గల నావల్ షిప్ రిపేర్ యార్డ్‌లో మొత్తం 145 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. దరఖాస్తుకు డిసెంబర్ 1 చివరి తేదీ. ఆసక్తిగల అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినవారు దరఖాస్తు చేయొచ్చు. మరిన్ని వివరాలకు

విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్ అప్రెంటీసెస్ స్కూల్ 275 ఖాళీలను ప్రకటించింది. దరఖాస్తు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి డిసెంబర్ 5, ఆఫ్‌లైన్‌లో సబ్మిట్ చేయడానికి డిసెంబర్ 12 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం ఇండియన్ నేవీలో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ నేవీ ఎంట్రెన్స్ టెస్ట్-INET ద్వారా జనవరి 2021 కోర్స్‌కు 144 మందిని ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు 2019 డిసెంబర్ 19 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ ప్రకటించింది. ఎంపికైనవారు నాలుగేళ్ల బీటెక్ కోర్సు చేయడానికి 37 మందికి అవకాశం లభిస్తుంది. కేరళలోని నావల్ అకాడమీలో 2020 జూలైలో బ్యాచ్ ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు డిసెంబర్ 19 చివరి తేదీ. మరిన్ని వివరాల కోసం ఇండియన్ నేవీ అధికారిక వెబ్‌సైట్ https://www.joinindiannavy.gov.in/ లోనే దరఖాస్తు చేయాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com