హైదరాబాద్ ఇండియాకి రెండో రాజధాని...కేంద్రం క్లారిటీ!
- November 27, 2019
హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని ఒకసారి లేదా దేశానికి హైదరాబాద్ ని రెండో రాజధానిగా చేస్తారని గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఈ వాదన మరో సారి తెరమీదకు వచ్చింది. కొందరు బీజేపీ నేతలు ఆఫ్ ది రికార్డ్ చేసిన ప్రచారంతో హైదరాబాద్ రెండో రాజధాని అవుతుందనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందనే విశ్లేషణలు ఈ వాదనకి మరింత ఊతం ఇచ్చాయి. మొన్ననే ఈ విషయం మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ రోజు ఈ విషయమై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టే ఆలోచన తమకు లేదని కేంద్రం ప్రకటించింది. రాజ్యసభలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ సమాధానం ఇచ్చింది. దేశంలో రెండో రాజధానిని ఏర్పాటు చేసే ఆలోచన తమకు లేదని హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖిత పూర్వకంగా తెలిపారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







