ప్రముఖ నటిపై దాడి.. రక్తం వచ్చేలా కొట్టిన దుండగులు
- November 29, 2019ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ అగోస్టిని, ఆమె ఫ్రెండ్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లోని స్కైరూం బార్లో పార్టీ చేసుకున్న తర్వాత జెన్నిఫర్ తన ఫ్రెండ్స్‌తో కలిసి తెల్లవారుజామున 3 గంటల సమయంలో బయటకి వచ్చింది. 'మీలాంటి తెల్ల ఆడకుక్కల దగ్గర డబ్బు ఉంది కాబట్టే ఇలా తాగి తిరుగుతున్నారు' అంటూ కొంత మంది ఆకతాయులు వారిపై దాడి చేశారు. రక్తం వచ్చేలా కొట్టారు. ఇంతలో అక్కడికి వచ్చిన బార్ సిబ్బంది వారిని అడ్డుకొని హాస్పిటల్‌కి తరలించారు. నిందితులని పోలీసులకి అప్పగించారు. జెన్నిఫర్ పార్టీ చేసుకున్న బార్లో ఆఫ్రికన్, అమెరికన్స్ సెక్యూరిటీ గార్డులుగా పని చేస్తున్నారు. వర్క్ పూర్తి చేసుకుని వెళ్లిపోయాక వారిలో ఓ వ్యక్తి క్రెడిట్ కార్డు మర్చిపోవడంతో అది తీసుకోవడానికి బార్ క్లోజింగ్ టైంలో వచ్చాడు. దీంతో అతడిని లోపలకి అనుమతించలేదు. అయితే అదే సమయంలో తన స్నేహితులతో కలిసి బయటకి వస్తున్న జెన్నీఫర్ని చూసి కోపంతో ఊగిపోయిన వ్యక్తి వారి స్నేహితులతో కలిసి దాడి చేశాడు. రక్తం వచ్చేలా కొట్టాడు. జెన్నీఫర్కి ఐదు కుట్లు పడినట్టు వైద్యులు తెలిపారు. నటిపై జాతి వివక్ష దాడి జరగడం అమానుషం అని ఆమె అభిమానులు మండిపడుతున్నారు. జెన్నిఫర్ 'బ్లూక్లిన్ టైస్' అనే సినిమాలో నటించారు
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..