అమెరికాలో గ్రీన్ కార్డు కోసం భారతీయుల కుటుంబాల ఎదురుచూపులు
- November 29, 2019
అమెరికాలో భారీ సంఖ్యలో భారతీయులు కుటుంబ ఆధారిత గ్రీన్ కార్డ్ (చట్టపరమైన శాశ్వత నివాసం) కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో మొత్తం 40 లక్షల మంది ప్రజలు ఈ రకమైన గ్రీన్‌కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ, అమెరికా ప్రభుత్వం మాత్రం ఏటా 2,26,000 మాత్రమే జారీ చేయాలని నిర్ణయించింది. వీటికోసం ఎదురు చూస్తున్న వారిలో మెక్సికో దేశానికి చెందిన 1.5 లక్షల మంది ఉన్నారు. ఇక భారత్‌కు చెందిన 2,27,000 మంది ఉండగా 1,80,00 మంది చైనీయులు కూడా ఈ జాబితాలో వేచిచూస్తున్నారు. దాదాపు పదేళ్ల నుంచి ఎదురు చూస్తోన్న భారతీయులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. ఈ జాబితాలోని వారిలో చాలా మంది ప్రస్తుతం అమెరికా పౌరసత్వం ఉన్నవారి కుటుంబసభ్యులే కావడం విశేషం. ప్రస్తుత చట్టం ప్రకారం అమెరికా పౌరులు వారి కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకులకు గ్రీన్‌కార్డ్ లేదా శాశ్వత నివాసాన్ని స్పాన్సర్ చేయవచ్చు. కానీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిని రద్దు చేయాలని అయన ఎప్పటి నుంచో భావిస్తున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!