టర్కీలో మరోసారి బాంబు దాడి
- January 13, 2016
: రెండు రోజుల వ్యవధిలోనే టర్కీలో మరోసారి బాంబు దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది. కుర్దిష్ తిరుగుబాటుదారులు జరిపిన కారు బాంబు దాడిలో అయిదుగురు మృతి చెందగా, 36 మంది గాయపడ్డారు. ఈ ఘటన గురువారం నార్త్-ఈస్ట్ టర్కీలో చోటుచేసుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన ఆత్మాహుతి దాడిలో 10 మంది జర్మన్ పర్యాటకులు మరణించిన విషయం విదితమే. డియాబకిర్ సమీపంలోని సినార్ పట్టణంలోని ఓ పోలీస్ స్టేషన్ లక్ష్యంగా కుర్దిష్ వర్కర్స్ పార్టీ(పీకేకే) రెబల్స్ కారుబాంబుతో దాడికి పాల్పడ్డారు. పోలీసులు, వారి కుటుంబసభ్యులు ఈ ఘటనలో గాయపడ్డారు. కారు బాంబు జరిపిన అనంతరం రాకెట్ బాంబులతో దూరపు లక్ష్యాలను టార్గెట్ చేసుకుని దాడి చేసినట్లు అధికారులు చెబుతున్నారు.పోలీస్ స్టేషన్ సహా దానిని అనుకుని ఉన్న ఓ ఇళ్లు ధ్వంసమైంది. పీకేకే 1984లో తిరుగుబాటు ప్రారంభించింది, కానీ అనంతరం తమ ఉనికిని మరింత విస్తృతం చేసేదిశగా ఈ దాడులకు పాల్పడుతోందని అధికారి చెప్పారు. అప్పట్లో జరిగిన దుర్ఘటనలో వేల మంది చనిపోయారు. డజన్ల కొద్ది సామాన్యులు రెబల్స్ దాడుల్లో మృతిచెందుతుండటం, మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగిన కారణంగా మిలిటరీ ఇటీవలే మూడు నగరాలలో తనిఖీలు చేపట్టిన విషయం విదితమే.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







