శరీర దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి??
- November 30, 2019
పొద్దున్నే శుభ్రంగా స్నానం చేసినప్పటికీ, మధ్యాహ్నానికి శరీరం నుంచి చెమట వాసన ఇబ్బందిపెడుతుంది. శరీరం నుంచి వచ్చే దుర్వాసనను పొగొట్టడానికి ఈ చిట్కాలను పాటిస్తే చాలా మంచి ప్రభావం కనిపిస్తుంది.
* ఒక టేబుల్ స్పూన్ తేనెను బకెట్ నీళ్లలో కలిపి, ఆ నీటితో స్నానం చేయండి. చెమట కానీ, చెమట వాసన కానీ మీ దరిచేరదు.
* వేసవిలో ఎక్కువ భాగం కాటన్ దుస్తులను ధరించడం వల్ల శరీరానికి బాగా గాలి అందుతుంది. ఫలితంగా దుర్వాసన రాదు.
* టీ, కాఫీలు చెమట ఉత్పత్తికి కారకాలు. కాబట్టి చెమట వాసన నుంచి తప్పించుకోవడానికి టీ, కాఫీలకు దూరంగా ఉండండి.
* రోజువారీ తీసుకునే ఆహారంలో 20 శాతం మాంసకృతులు, 20 శాతం నూనెలు, కొవ్వు పదార్థాలు, పండ్లు ఉంటే చెమటను దూరం చేయవచ్చు.
* స్నానపు నీటిలో ఉడికించిన పుదినా ఆకులను వేసి స్నానం చేస్తే చర్మం ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.
* సోంపు గింజలు నోటినే కాకుండా శరీర వాసనను ప్రభావితం చేస్తాయి. రోజూ ఒక స్పూన్ సోంపు గింజలను తినడం మంచిదే.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!