ఉచితంగా గల్ఫ్ మృతదేహాలు తరలింపునకు కొత్త పథకం:కేరళ ప్రభుత్వం

- November 30, 2019 , by Maagulf
ఉచితంగా గల్ఫ్ మృతదేహాలు తరలింపునకు కొత్త పథకం:కేరళ ప్రభుత్వం

కేరళ:తమ రాష్ట్రం నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన ప్రవాసీయులకు కేరళ ప్రభుత్వం ఊరటనిచ్చింది. అనారోగ్యంతో మృతిచెందిన వారి మృతదేహాలను ఎలాంటి రవాణా ఖర్చు లేకుండా భారత్‌కు తరలించేలా కేరళా ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. 

గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వారి మృతదేహాలను ఎలాంటి ఖర్చు లేకుండా ఇండియా తరలించేందుకు ఎయిర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. మృతదేహాలను సొంతదేశానికి తరలించేందుకు కంపెనీ యాజమాన్యం, రాయబార కార్యాలయం సహాయం చేయని సమయాల్లో కేరళా ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త పథకం ఎంతగానో దోహపడుతోంది. 

కేరళా ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఈ కొత్త పథకాన్ని ప్రారంభించారు. గల్ఫ్ లో పని చేస్తూ మృతి చెందిన వారిని కనీసం సొంత దేశానికి కూడా తీసుకురాలేనంతగా ఒక్కోసారి ఆర్ధిక సమస్యలు ఎదురవుతాయని ఆయన పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com