బీజేపీకి మద్దతుగా కమెడియన్ బ్రహ్మానందం ఎన్నికల ప్రచారం
- December 01, 2019
కర్ణాటక రాష్ట్రంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబరు 5వతేదీన నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఎన్నికలకు మరో మూడురోజుల సమయమే ఉండటంతో... పార్టీలు ప్రచారాన్ని జోరు పెంచాయి. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. జేడీఎస్ అధినేత దేవెగౌడ చిక్క బళ్లాపురలో ప్రచారం నిర్వహించారు. ప్రముఖ తెలుగు హాస్యనటుడు బ్రహ్మానందం శనివారం చిక్కబళ్లాపురలో బీజేపీ అభ్యర్థికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఆయనను చూడడానికి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రహ్మానందం బీజేపీ అభ్యర్థికి సుధాకర్‌కు అంతా ఓటేసి గెలిపించాలని కోరారు. సుధాకర్ రెడ్డి తనకుమంచి మిత్రుడన్నారు. అందుకే ఆయన ఎన్నికల ప్రచారానికి వచ్చానన్నారు. అయితే తెలుగులోనే మాట్లాడారు బ్రహ్మానందం. పలు తెలుగు సినిమా డైలాగ్స్ వేస్తూ...అభిమానుల్లో ఉత్సాహం నింపారు.
ఉప ఎన్నికల్లో అనర్హత ఎమ్మెల్యేలను ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్, జేడీఎస్ శ్రమిస్తున్నాయి. సీఎల్పీ నేత సిద్ధరామయ్య బెళగావి జిల్లా కాగవాడలో కాంగ్రెస్ అభ్యర్థి రాజుకాగె తరఫున ప్రచారం చేశారు. మాజీ సీఎం కుమారస్వామి కాగవాడలో జేడీఎస్ అభ్యర్థి శ్రీశైలతుగశెట్టికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







