దిశ హత్య ఘటనపై మహిళలపై అట్టుడికిన రాజ్యసభ..దాడులకు స్వస్తి పలకాలి: వెంకయ్య

- December 02, 2019 , by Maagulf
దిశ హత్య ఘటనపై  మహిళలపై అట్టుడికిన రాజ్యసభ..దాడులకు స్వస్తి పలకాలి: వెంకయ్య

న్యూఢిల్లీ : దిశ హత్య ఘటనపై రాజ్యసభలో చర్చ జరుగుతుంది. ఈ చర్చను రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రారంభించారు. హైదరాబాద్‌లో జరిగిన దిశ హత్య కేసు మన సమాజానికి, మన వ్యవస్థకు తీవ్ర అవమానం. ఇలాంటి చర్యలు ఎందుకు జరుగుతున్నాయో, వీటి పరిష్కార చర్యల కోసం మనం ఏదో ఒకటి చేయాలి. దిశ హత్య ఘటనపై ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలు ఇవ్వాలని సభ్యులను వెంకయ్య నాయుడు కోరారు. సభ్యులు సూచనల అనంతరం వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం చట్టాల వల్ల బాధితులకు న్యాయం జరగదు. ప్రజల్లో కూడా మార్పు రావాలి. హైదరాబాద్ లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. మహిళలపై దాడులకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది అని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. దిశ హత్య దేశం మొత్తాన్ని కలచివేసింది. చట్టాలు చేయడం ద్వారా మాత్రమే సమస్య పరిష్కారం కాదు. సమస్య మూలాల నుంచి తొలగించడానికి సమాజం నిలబడాలి. ఎలాంటి పక్షపాతం లేకుండా నిందితులకు శిక్షపడాలి.

- గులాం నబీ ఆజాద్‌: ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలి.

- కనకమేడల రవీంద్ర కుమార్‌: తక్షణమే ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఏర్పాటు చేయాలి. నలుగురు నిందితులకు ఈ ఏడాది డిసెంబర్‌ 31లోగా ఉరిశిక్ష వేయాలి.

- అన్నాడీఎంకే ఎంపీ విజిలా సత్యనాథ్‌: ఘోరమైన నేరానికి పాల్పడిన ఈ నలుగురు నిందితులకు కఠిన శిక్ష విధించాలి. నిందితులకు ప్రజల మధ్యలోనే శిక్ష వేయాలి.

- ఎస్పీ ఎంపీ జయబచ్చన్‌: దిశ హత్య కేసులో ప్రభుత్వం నుంచి కచ్చితమైన సమాధానం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. నిర్భయ కేసులో ఇంకా న్యాయం జరగలేదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com