తెలంగాణ:విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ
- December 03, 2019
హైదరాబాద్: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వనున్నారు. ఆత్మరక్షణ శిక్షణ కోసం పాఠశాల విద్యాశాఖ రూ.1.38కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వందకు మించి విద్యార్థులున్న 1,513 ఉన్నత పాఠశాలల్లో విద్యార్థినులకు కరాటే, జూడో వంటి మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ.3వేలు చొప్పున మంజూరు చేశారు. వారంలో రెండు మార్షల్ ఆర్ట్స్ తరగతులను.. గంట చొప్పున నిర్వహించాలని పేర్కొన్నారు. జాతీయ క్రీడా సంస్థలు లేదా యూనివర్సిటీ నుంచి జూడో, మార్షల్ ఆర్ట్స్‌లో సర్టిఫికెట్ ఉన్న శిక్షకుడిని నియమించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







