పెరల్ హార్బర్ కాల్పుల ఘటన: భారత ఐఏఎఫ్ చీఫ్ క్షేమం
- December 05, 2019
హవాయి : ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ రాకేశ్‌కుమార్ సింగ్ బదౌరియా క్షేమంగా ఉన్నారని వైమానిక దళ అధికార ప్రతినిధి గురువారం వెల్లడించారు. వివరాలు.. ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో భద్రతపై చర్చించడానికి అమెరికా మిలిటరీ స్థావరమైన హవాయిలోని పెర్ల్ హార్బర్‌లో వివిధ దేశాల వాయుసేనాధ్యక్షులతో ఓ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో పాల్గొనడానికి బదౌరియా అక్కడికి వెళ్లారు. అయితే బుధవారం పెర్ల్ హార్బర్ నౌకాశ్రయంలో ఓ సెయిలర్ ముగ్గురిని కాల్చి చంపేసి అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలోబదౌరియా పెర్ల్‌హార్బర్‌లోని ఎయిర్ బేస్‌లో ఉన్నారని, కాల్పుల ఘటన నౌకాశ్రయంలో జరిగిందని అధికార ప్రతినిధి వివరించారు.
కాగా, అమెరికా నౌకాదళ సైన్యానికి పెరల్ హార్బర్ కేంద్రంగా ఉంది. ఇక్కడ భారీ నౌకలకు రిపేర్, మెయింటేన్ చేస్తారు. వాటిని ఆధునీకరిస్తారు. పెరల్ హార్బర్‌లోనే సుమారు 10 డెస్ట్రాయర్లు, 15 సబ్‌మెరైన్లు కూడా ఉన్నాయి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ దాడి చేసింది ఈ నాకౌశ్రయంపైనే. ఈ శనివారం ఆ దాడికి 78 ఏళ్ల పూర్తయ్యాయి. ఈ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకునే కాల్పులు జరిగాయి.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







