నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై ఆర్థిక శాఖ వివరణ
- December 05, 2019
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగాఉల్లి ధరల పెరుగుదలపై పార్లమెంట్‌లో చర్చ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్‌లో వైరల్‌గా మారాయి. తాను ఉల్లిపాయలు ఎక్కువగా తిననని, వాటితో పెద్దగా సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చానని ఆమె చేసిన వ్యాఖ్యలపై నెట్‌లో సెటైర్లు పేలుతున్నాయి. నిరుద్యోగం ఎందుకు పెరిగిపోయిందని నిర్మలను అడిగితే.. తన కుటుంబంలో ఎవరూ నిరుద్యోగులు లేరని విచిత్ర సమాధానం చెబుతారేమో అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరిగాయని ఆమెతో చెబితే.. తాను మంత్రినయినప్పటి నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయడం లేదని అంటారేమోనని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
ఇలా ఉల్లిపాయపై ఆమె చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమవుతుండటంతో ఆర్థిక శాఖ వివరణ ఇచ్చుకుంది. ఉల్లి ధరలపై ఆమె సరైన రీతిలోనే స్పందించారని, అందుకు సంబంధించిన పూర్తి వీడియో ఇదే అని నిర్మల ప్రసంగానికి సంబంధించిన వీడియోను ఆర్థిక శాఖ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలోని ఓ క్లిప్‌ను ప్రచారం చేసి తప్పుదోవ పట్టించేందుకు వినియోగిస్తున్నారని ఆర్థిక శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్‌పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్‌లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10







