యూఏఈ: ఇన్సూరెన్స్ నిరాకరణ..2 ఏళ్ల బాలుడిని బలిగొన్న వైద్యులు

- December 05, 2019 , by Maagulf
యూఏఈ: ఇన్సూరెన్స్ నిరాకరణ..2 ఏళ్ల బాలుడిని బలిగొన్న వైద్యులు

ఇన్సూరెన్స్ చెల్లని కారణాన వైద్యం అందక మృతి చెందిన 2 ఏళ్ల బాలుడు. ఈ ఘటన అల్ ఐన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

అరబ్ వాసి అయిన 2 ఏళ్ల కరీమ్ కు జ్వరం రావడంతో అల్ ఐన్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించాడు తండ్రి అల రావాగ్బీ. డాక్టర్లు యాంటీబయాటిక్స్ ఇచ్చి వైద్యం అందించారు. రోజులు గడుస్తున్నా కరీమ్ మందుల పట్ల స్పందించకపోవడంతో తండ్రి పిల్లవాడిని మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించుకున్నాడు. రెండవ ఆసుపత్రిలో కరీమ్ కు మళ్ళీ పరీక్షలన్నీ నిర్వహించి, బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉందనీ, వెంటనే ట్రీట్మెంట్ మొదలుపెట్టాలని సూచించారు వైద్యులు. ఈ వైద్యం ఇన్సూరెన్స్ లో కవర్ అవ్వనికారణంగా వైద్యులు కెరీమ్ తండ్రిని తక్షణం 10,000 దిర్హాములు కట్టి పిల్లవాడిని ఆసుపత్రిలో జాయిన్ చేయమని వైద్యులు నిర్బంధించారు. తన వద్ద ప్రస్తుతం 2000 దిర్హాములు ఉన్నాయనీ, వైద్యం మొదలుపెట్టామనీ, మర్నాటికి మిగిలిన డబ్బును అందచేస్తానని చెప్పినా వైద్యం అందించటానికి నిరాకరించిన యాజమాన్యం.

పిల్లాడి పరిస్థితి క్షీణిస్తోందని గుర్తించిన తండ్రి కరీమ్ ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికే వైద్యం ఆలస్యం అవ్వటంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా 2 ఏళ్ల కరీమ్ కన్నుమూశాడు.

తన కుమారుని మరణానికి కారణమైన వైద్య బృందం నిర్లక్ష్యానికి అల్ ఐన్ లోని రెండు ప్రైవేట్ ఆస్పత్రులు మరియు శిశువైద్యునిపై కేసు వేసాడు కరీమ్ తండ్రి. తండ్రి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలిస్తున్నామని ఆరోగ్య శాఖ ఎమారత్ అల్ యూమ్కు తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com