విజన్ 2030: వివిధ విదేశీ నిపుణులకు జాతీయతను మంజూరు చేయనున్న సౌదీ
- December 05, 2019
రియాద్: 2016 లో ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం సౌదీ విజన్ 2030 కు అనుగుణంగా చమురు ఆధారిత సౌదీ ఆర్థిక వ్యవస్థను వైవిధ్యపరుస్తూ జాతీయ అభివృద్ధి మరియు పౌరుల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ ప్రతిభావంతులైన విదేశీ నిపుణులకు సౌదీ జాతీయతను మంజూరు చేసేందుకు ఉత్తర్వులు జారీచేసిన సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్.
దాదాపు రెండు నెలల క్రితం జారీ చేసిన రాయల్ డిక్రీ ప్రకారం, ఇస్లామిక్ పండితులతో పాటు అణు మరియు పునరుత్పాదక ఇంధనం, మెడిసిన్, ఫార్మకాలజీ, కంప్యూటర్ సైన్స్, ఆయిల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఎకాలజీ, ఆస్ట్రోనాటిక్స్, ఏవియేషన్, కల్చర్, స్పోర్ట్స్ అండ్ ఆర్ట్స్ వంటి వివిధ విభాగాలలోని ప్రముఖ నిపుణులకు సౌదీ జాతీయత మంజూరు చేయబడుతుంది.
ఈ ప్రక్రియ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశిష్ట మరియు సృజనాత్మక వ్యక్తులు సౌదీ అరేబియాలో నివసించడానికి మరియు పని చేయడానికి మార్గం సుగమం అవుతుందని నివేదిక తెలిపింది. నివేదించబడిన సహజీకరణలో ముస్లిమేతర నిపుణులు కూడా ఉన్నారా అనేదానిపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







