షార్జాలో భారత విద్యార్ధిని మృతి
- December 08, 2019
షార్జాలో విషాదం చోటుచేసుకుంది. భారత సంతతికి చెందిన 15 ఏళ్ల బాలిక పదో అంతస్తుపై నుంచి పడి మృతిచెందింది. పోలీసులు బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటన రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అయితే..ఘటన జరిగిన మరుసటి రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆమెను కువైటీ ఆస్పత్రికి తీసుకొచ్చారని, అప్పటికే ఆమె మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు..మృతురాలి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆల్ ఘర్బ్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. బాలిక మృతి కారణాలు, ఘటన జరిగిన తీరుపై తల్లిదండ్రుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సైంటిఫిక్ ఆధారాల కోసం మృతదేహ అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలించారు. చనిపోయిన బాలిక పదో గ్రేడ్ చదువుతోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!