కువైట్:వివాదాస్పదమైన స్కూల్ ప్రిన్సిపాల్ నియామకం
- December 09, 2019
కువైట్ లో స్కూల్ ప్రిన్సిపాల్ నియామకం తీరు వివాదస్పదం అవుతోంది. స్కూల్ ప్రిన్సిపల్ పోస్టుల కోసం విద్యా మంత్రిత్వశాఖ అప్లికేషన్లను స్వీకరిస్తోంది. అయితే.. ప్రిన్సిపల్ పోస్టుకు అప్లై చేసిన వారిలో చాలా మంది గతంలో జరిగిన అసిస్టెంట్ స్కూల్ ప్రిన్సిపల్ ఎగ్జామ్ లో ఫెయిల్ అవటమే తాజా వివాదానికి కారణమైంది.
అసిస్టెంట్ స్కూల్ ప్రిన్సిపల్ పోస్ట్ కు అర్హత సాధించలేకపోయిన వారి నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించటం ద్వారా పరీక్షల్లో అక్రమాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయని, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడొచ్చని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ప్రతిసారి ఇలాంటి ఆరోపణలు సర్వ సాధారమని, ఈ సారి కూడా అదే తరహాలో వచ్చినట్లు విద్యా శాఖ వర్గాలు తెలిపినట్లు అల్-రై పత్రిక తన కథనంలో వివరించింది. పైగా ఆయా పోస్టులకు నిర్వహించే పరీక్షల్లో ఒకే తరహాలో స ఉంటాయని అధికారులు వివరించారు. అన్ని విద్యాసంస్థల్లో ఆన్ లైన్ లో కూడా ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్కూల్ ప్రిన్సిపల్ పోస్టుల భర్తీ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







