ఒమాన్ లో భారీవర్షాలు..సహాయక బృందాల తరలింపు
- December 09, 2019
ఒమాన్:అల్ ధహిరా గవర్నేట్ పరిధిలో గత రెండు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్ష ప్రభావంతో లోయలు, కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్& అంబులెన్స్ - పీఏసీడీఏ కు చెందిన సహాయక బృందాలను హుటాహుటిన వర్షప్రభావిత ప్రాంతాలకు తరలించారు.
తుజాజ్ తుఫాన్ కారణంగా ఒమన్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించినట్లు వివరించారు. లోయలు, వాగుల్లో నీటి ప్రావాహం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి ప్రవాహం దాటే ప్రయత్నం చేయొద్దని పీఏసీడీఏ హెచ్చరించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







