గల్ఫ్‌ కప్‌ ట్రోఫీలో సౌదీని ఓడించిన బహ్రెయిన్‌

- December 09, 2019 , by Maagulf
గల్ఫ్‌ కప్‌ ట్రోఫీలో సౌదీని ఓడించిన బహ్రెయిన్‌

తొలిసారిగా బహ్రెయిన్‌, గల్ఫ్‌ కప్‌ని గెల్చుకుంది. సౌదీ అరేబియాపై ఈ విజయాన్ని అందుకుంది బహ్రెయిన్‌. దోహాలో జరిగిన పోటీలో సంపూర్ణ ఆధిపత్యాన్ని బహ్రెయిన్‌ ప్రదర్శించడంతో సౌదీ అరేబియా చేతులెత్తేయక తప్పలేదు. బహ్రెయినీ ఆటగాడు మొహమ్మద్‌ అల్‌ రోహైమి 69వ నిమిషంలో చేసిన గోల్‌తో బహ్రెయిన్‌కి విజయం దక్కింది. కాగా, ఐదో అటెంప్ట్‌లో బహ్రెయిన్‌ ఈ టైటిల్‌ని సొంతం చేసుకోవడం గమనార్హం. గతంలో నాలుగు సార్లు ఫైనల్స్‌లో ఓటమి పాలయ్యింది బహ్రెయిన్‌. మరోపక్క, వరుసగా మూడోసారి దేశానికి కప్‌ అందించాలనుకున్న సౌదీ కెప్టెన్‌ సల్మాన్‌ అల్‌ ఫరాజ్‌ ఆశలు నెరవేరలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com