దుబాయ్:మరింత సులభతరం కానున్న వీసా అప్లికేషన్
- December 10, 2019
దుబాయ్ లో నివాసితులు వీసా దరఖాస్తుల కోసం ఇక నుంచి ప్రభుత్వ సేవా కేంద్రాల దగ్గర పడిగాపులు పడాల్సిన అవసరం లేదు. క్యూలైన్లు, రోజుల తరబడి నిరీక్షణ లేకుండానే ఆన్ లైన్ ద్వారా వీసా పొందే సౌకర్యాన్ని అందుబాటులోకి వచ్చింది. దుబాయ్ నౌ యాప్ ద్వారాగానీ, వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ లో వీసా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న 30 నిమిషాల నుంచి రెండు పనిదినాల్లో వీసా మంజూరు అవుతుంది.
ఇప్పటివరకు వీసా దరఖాస్తుదారులు నగరం చుట్టు ఉన్న అమెర్ సేవా కేంద్రాల దగ్గర వేచి ఉండాల్సి వచ్చేది. ఇక నుంచి అలాంటి ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కొత్త అమల్లోకి తీసుకొచ్చిన ఈ యాప్ ను పరీక్షించేందుకు పైలెట్ గా ఎవరైనా వ్యక్తులైనా సంస్థలైనా అప్లై చేసుకొని తమ రెసిడెన్సీ వీసా అప్లికేషన్ అర్హతను అలాగే కుటుంబసభ్యుల రెసెడెన్సీ వీసా రెన్యువల్ ను తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు దుబాయ్ నౌ యాప్ ప్రారంభమైన ఈ నెల రోజుల్లో దాదాపు 350 మంది ఈ అప్లికేషన్ ద్వారా కొత్త రెసెడెన్సీ వీసా, వీసా రెన్యూవల్ చేయించుకున్నట్లు స్మార్ట్ దుబాయ్ జనరల్ డైరెక్టర్ డాక్టర్ ఐషా బిన్ట్ బుట్టి బిన్ బిష్ర్ తెలిపారు. 2021 నాటికల్లా దుబాయ్ లో ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాలను పేపర్ లెస్ గా మార్చే విధానాలకు అనుగుణంగా దుబాయ్ నౌ ఫీచన్ ను అమల్లోకి తీసుకొచ్చిట్లు పేర్కొన్నారు. ప్రతీ సంవత్సరం ఒక బిలియన్ పేపర్లను సేవ్ చేయటమే తమ లక్ష్యం అని ఆమె అన్నారు.
దుబాయ్ నౌ యాప్ తో పలు రకాల సేవలు పొందవచ్చని స్టార్ట్ దుబాయ్ డీజీ పేర్కొన్నారు. వీసాల జారీ, రెన్యూవల్ తో పాటు వివరాల మార్పులు చేర్పులు, వీసా క్యాన్సలేషన్, స్పాన్సర్ షిప్ ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని ఆమె తెలిపారు. ఇమ్మిగ్రేషన్ ఏజెన్సీ, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ& ఫారెన్ అఫైర్స్ భాగస్వామ్యంతో దుబాయ్ నౌ సర్వీసులను అందిస్తున్నామని అన్నారు. దుబాయ్ నౌ యాప్ తో సమయం వృద్ధా కాకుండా మరింత సులభంగా సేవలు పొందవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







