వర్షంతో యూఏఈ-స్కాట్లాండ్ వన్డే మ్యాచ్ ఆలస్యం
- December 11, 2019
షార్జా:ఈ ఉదయం కురిసిన భారీ వర్షం కారణంగా షార్జాలో వేదికగా జరగాల్సిన వన్డే క్రికెట్ మ్యాచ్ ఆలస్యం కానుంది. వరల్డ్ కప్ లీగ్ -2 లో భాగంగా ఈ రోజు యూఏఈ- స్కాంట్లాండ్ తో తలపడాల్సి ఉంది. ఈ ఉదయం 11 గంటల ప్రాంతంలో ఆకాశంలోని మేఘాలు క్లియర్ అయ్యాయి. సూర్యకాంతి కూడా వచ్చింది. అయితే..గ్రౌండ్ ఔట్ ఫీల్డ్ లో ఇంకా నీరు నిలిచి ఉండటం మ్యాచ్ ఆలస్యానికి కారణం అవుతోంది. గ్రౌండ్ స్టాప్ మైదానాన్ని డ్రైగా మార్చి మ్యాచ్ కు సిద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
మ్యాచ్ కొనసాగాలంటే ఇరుజట్లు కనీసం 20 ఓవర్లైనా ఆడేంత సమయం ఉండాలి. ఒకవేళ మ్యాచ్ మధ్యాహ్నం 2.45 గంటల వరకల్లా ప్రారంభం కాకుంటే వన్డే పూర్తిగా రద్దు అవుతుంది. యూఏఈ, స్కాట్లాండ్ కు చెరోక పాయింట్ దక్కుతుంది. ఈ సీరిస్ లో యూఏఈ గత ఆదివారం యూఎస్ తో ఓ మ్యాచ్ ఆడి ఓడిపోయింది. స్కాట్లాండ్ కూడా యూఎస్ చేతిలో ఓటమి పాలైంది. ఈ సిరీస్ అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన జట్టు 2023లో భారత్ వేదికగా జరగనున్న వరల్డ్ కప్ కు అర్హత సాధిస్తుంది. ప్రస్తుతం సిరీస్ లో యూఎస్ టీం టాప్ పొజిషన్ లో ఉంది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







