ఒమన్‌లో పలువురు స్ట్రీట్‌ వెండర్స్‌ అరెస్ట్‌

ఒమన్‌లో పలువురు స్ట్రీట్‌ వెండర్స్‌ అరెస్ట్‌

మస్కట్‌: విలాయత్‌ అల్‌ సీబ్‌లో అధికారులు నిర్వహించిన తనిఖీల సందర్భంగా పలువురు స్ట్రీట్‌ వెండర్స్‌ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పలు ఉల్లంఘనలకు నిందితులు పాల్పడినట్లు అధికారులు వెల్లడించారు. మస్కట్‌ మునిసిపాలిటీ, ఉల్లంఘనలకు పాల్పడుతున్న స్ట్రీట్‌ వెండర్స్‌పై దాడులు నిర్వహించినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా పేర్కొన్నారు. లైసెన్స్‌ లేకుండా విక్రయాలు జరపడం, ఇతరుల ప్రాణాలకు హాని కలిగేలా పరిశుభ్రత లేని ఆహార పదార్థాల్ని విక్రయించడం, అలాగే ప్రమాదాలకు కారణమవుతుండడం వంటి అభియోగాలు నిందితులపై మోపబడ్డాయి.

Back to Top