చరిత్ర సృష్టించిన సౌదీ అరామ్కో కంపెనీ
- December 12, 2019
సౌదీ అరేబియా: ఇటీవలే పబ్లిక్ ఇష్యూకు వచ్చిన సౌదీ అరేబియాకు చెందిన ఆయిల్ దిగ్గజం అరామ్కో.. ట్రేడింగ్ బుధవారంనాడు ప్రారంభమైంది. తొలి రోజే షేరు ధర దూసుకుపోయింది. ఆరంభంలోనే 10 శాతం మేర షేరు ధర పెరగడంతో కంపెనీ విలువ 1.88 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. ఈ స్థాయిలో ప్రపంచంలో లిస్టయిన ఏ కంపెనీ మార్కెట్ విలువ లేదు. రియాద్‌లోని సౌదీ తడావుల్ స్టాక్ ఎక్స్ఛేంజీలో ఉదయం 10.30 గంటలకు అరామ్కో షేర్ల ట్రేడింగ్ ఆరంభమైంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా 1.5 శాతం వాటాను విక్రయించారు. ఒక్కో షేరు ధరను 32 సౌదీ రియాల్స్ (8.53 డాలర్లు)గా నిర్ణయించారు. షేరు ధర 10 శాతం మేర పెరగడంతో 35.2 రియాల్స్‌కు చేరుకుంది. దీంతో మార్కెట్ విలువ 1.8 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ప్రస్తుతం అరామ్కో మార్కెట్ విలువ మైక్రోసాఫ్ట్ లేదా యాపిల్‌కన్నా ఎక్కువగా ఉంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!