ఎక్స్‌పో 2020 కోసం దుబాయ్ చేరుకున్న మూడు గేట్లు
- December 12, 2019
దుబాయ్:భారీ కట్టడాలు, విశిష్టమైన ఆవిష్కరణలతో ప్రత్యేకతను చాటుకునే దుబాయ్ మరో ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కు సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది అక్టోబర్ 20 నుంచి ప్రారంభమయ్యే ఎక్స్‌పో 2020కి కళ్లు చెదిరే సెట్టింగ్ తో ముస్తాబవుతోంది. దాదాపు 600 ఫుట్ బాల్ గ్రౌండ్ లకు సమానమైన విస్తీర్ణంలో ఎక్స్‌పోను ఏర్పాటు చేస్తున్నారు. ఈ భారీ ఈవెంట్‌కు ఎంట్రెన్స్‌లను కూడా అంతే భారీ సైజులో ఏర్పాటు చేస్తున్నారు. 30 మీటర్ల వెడల్పు, 21 మీటర్ల పొడవుతో కార్బన్ ఫైబర్ స్ట్రక్చర్ ఎంట్రెన్స్ ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు ఆహ్వానం పలకనున్నాయి. ఇలాంటి ఎంట్రెన్స్‌లను మొత్తం మూడు ఏర్పాటు చేస్తున్నారు. సౌత్ దుబాయ్ లోని వరల్డ్ సెంటర్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో ఎక్స్‌పో ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జర్మనీలో ఈ భారీ ఎంట్రెన్స్ ఫైబర్ స్ట్రక్చర్‌ను రూపొందించారు. ఎంట్రెన్స్ సామాగ్రి జర్మనీలోని బవారియా నుంచి యూరప్‌లోని రెండో అతిపెద్ద ఓడరేవు అంట్వెర్ప్ చేరుకొని అక్కడి నుంచి జెబెల్ అలికి చేరినట్లు ఎక్స్‌పో లాజిస్టిక్స్ కంపెనీ యూపీఎస్ తెలిపింది. ఈ భూమి మీద ఇంత పెద్ద గేట్ వే మరెక్కడా లేదని జర్మన్ మాన్యుఫ్యాక్చర్ HA-CO కార్బన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ మార్టిన్ ఒస్స్వాల్డ్ అన్నారు. నభూతో నభవిష్యత్ అనే స్థాయిలో నిర్మానం ఉండాలని భావించిన ఎక్స్‌పో 2020 అతిథ్య దేశం ఆశించినట్టుగానే భారీ ఎంట్రెన్స్‌లను రూపొందించామని తెలిపారు. ఎక్స్‌పో మొత్తానికే ఎంట్రివేస్ హైలెట్ గా నిలుస్తాయని, వరల్డ్ ఫెయిర్ స్ఫూర్తికి నిదర్శనంగా ఉంటుందని ఆయన అన్నారు.
అక్టోబర్ 2020 నుంచి ఏప్రిల్ 2021 వరకు జరుగుతుంది. ఈ ఆరు నెలల్లో ప్రదర్శనను దాదాపు 25 మిలియన్ల సందర్శకులు వస్తారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వేల మంది స్టాఫ్ ఇందుకోసం నిరంతరాయంగా శ్రమిస్తున్నారని పేర్కొంది. 200 రెస్టారెంట్లు ప్రతీ రోజు 3 లక్షల మందికి భోజనాల ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!