TikTok నుంచి మరో కొత్త యాప్
- December 12, 2019
టిక్‌టాక్ యాప్ యజమాన్యం బైట్‌డాన్స్ ఇంక్ దాని వైరల్ వీడియో-షేరింగ్ టిక్ టాక్ యాప్ ప్రపంచంలోనే టాప్ 10 యాప్ లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు అదే బైట్‌డాన్స్ ఇంక్ మరో కొత్త మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్ అందుబాటులోకి తేనుంది. ఈ కొత్త యాప్ కి రెసో(Resso)అని పేరు పెట్టారు.
రెస్సో అని పిలువబడే ఈ కొత్త యాప్ ఇప్పుడు భారతదేశం, ఇండోనేషియాలో అందుబాటులో ఉంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో బీటా వెర్షన్ రూపంలో అందుబాటులో ఉంచారు. త్వరలో ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.ఇక త్వరలోనే పూర్తి స్థాయి వెర్షన్‌ను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తేనున్నారు.
ప్రపంచంలోని అత్యంత విలువైన స్టార్టప్ అయిన బైట్‌డాన్స్ ఇంక్ కంపెనీ టిక్ టాక్ యాప్ ద్వారా ఎంతో మంది వినియోగదారులను సంపాదించింది. స్పాట్‌ఫై, ఆపిల్ మ్యూజిక్ వంటివాటిని సవాలు చేయడానికి ఈ కొత్త యాప్ ని అభివృద్ధి చేస్తోంది.
స్పాటిఫై యాప్ లాగా కాకుండా, రెస్సో యాప్ రియల్ టైమ్ మ్యూజిక్ లిరిక్స్ ని చూపిస్తుంది. అలాగే వినియోగదారులు వారి కామెంట్స్ ని ఆ పాటల క్రింద పోస్ట్ చేయడానికి అనుమతిస్తుంది. టిక్‌టాక్ ఫీచర్ లాగే ఇందులో మ్యూజిక్ తో కూడిన జీఫ్ లను, వీడియోలను క్రియేట్ చేయవచ్చు.
ఈ యాప్ కోసం ప్రస్తుతం నెలవారీ సబ్స్క్రిప్షన్ చేసుకోవాలి.ఈ యాప్‌ను నెలకు రూ.119 సబ్‌స్క్రిప్షన్ తో భారత్‌లో అందివ్వనున్నట్లు తెలిసింది. ప్రీమియం రెస్సో వినియోగదారులు మ్యూజిక్ ని వినొచ్చు ఇంకా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. బీజింగ్‌కు చెందిన ఈ సంస్థ భారతీయ లేబుల్స్ టి-సిరీస్, టైమ్స్ మ్యూజిక్ నుండి హక్కులను పొందిందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ గతంలో నివేదించింది.
తాజా వార్తలు
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!