దుబాయ్ లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
- December 12, 2019
దుబాయ్: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్లో గురువారం రెండు వాహనాల మధ్య జరిగిన ట్రాఫిక్ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారని దుబాయ్ పోలీసు అధికారి తెలిపారు.
ఉదయం 5:30 గంటలకు పిక్-అప్ మరియు ట్రక్కు మధ్య ఈ ప్రమాదం జరిగిందని దుబాయ్ పోలీసు ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ బ్రిగేడియర్ సైఫ్ ముహైర్ అల్ మజ్రౌయి తెలిపారు. టైర్ పంక్చర్ కారణంగా రోడ్డు కుడి వైపు నుండి రెండవ లైన్లో ఆగిపోయిన ట్రక్కును వెనుక నుండి పికప్ ట్రక్ వెనుక భాగంలో గుద్దిందని ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి.
పోలీసు పెట్రోలింగ్ సంఘటన స్థలానికి వెళ్లి అంబులెన్స్ రాకముందే ట్రాఫిక్ కదలికలను నిర్వహించి గాయపడిన వారిని రషీద్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది మరియు సాంకేతిక నివేదికలు పూర్తయిన తర్వాత కేసు ఫైల్ దుబాయ్ ట్రాఫిక్ ప్రాసిక్యూషన్‌కు పంపబడుతుంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!