విద్యార్థినులపై లైంగిక వేధింపులు: వలసదారుడికి జైలు శిక్ష
- December 13, 2019మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ ఓ వలస కార్మికుడ్ని విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడన్న అభియోగాల నేపథ్యంలో అరెస్ట్ చేశారు. కేసు వివరాల్లోకి వెళితే, నిందితుడు ఓ స్కూల్లో పనిచేస్తున్నాడు. బాలికలకు తన వద్దనున్న మొబైల్ ఫోన్లో పోర్న్ వీడియోలు చూపించడం, వారితో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకు గురిచేస్తుండడంతో విద్యార్థినులు, తమ తల్లిదండ్రులకు విషయాన్ని చేరవేశారు. తల్లిదండ్రులు, నిందితుడిపై తొలుత స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు, ఆ తర్వాత పోలీసులకు సమాచారమిచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, నిందితుడి నుంచి నిజాల్ని రాబట్టారు. విచారణలో నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. కాగా, న్యాయస్థానం నిందితుడికి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. అలాగే 5,000 ఒమన్ రియాల్స్ జరీమానాతోపాటు, శిక్ష ముగిశాక నిందితుడ్ని డిపోర్ట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం