బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ చరిత్రాత్మక విజయం
- December 13, 2019లండన్: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో బోరిస్ జాన్సన్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఘన విజయం సాధించింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 650 స్థానాలకు గాను కన్జర్వేటివ్ పార్టీ 364 సీట్లను, లేబర్ పార్టీ 203 సీట్లను గెలుపొందాయి. వీటితో పాటు ఎస్ఎన్పీ 48 సీట్లు, ఇతరులు 34 సీట్లు కైవసం చేసుకున్నారు. మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన 326 సీట్లను దక్కించుకున్న కన్జర్వేటివ్ పార్టీ తిరిగి అధికారాన్ని చేపట్టనుంది. కాగా, బ్రెగ్జిట్‌పై పార్లమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అధికార పార్టీ మధ్యంతర ఎన్నికలకు వెళ్లింది. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడంతో.. బోరిస్ జాన్సన్ వరుసగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ 203 సీట్లకే పరిమితమవడంతో.. లేబర్ పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు జెరెమి కార్బిన్ రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఒమన్ లో మీడియా ముసాయిదా చట్టం పై చర్చ
- యూఏఈ-ఒమన్ రైల్వే: $3-బిలియన్ ప్రాజెక్ట్ నిర్మాణం ప్రారంభం
- బహ్రెయిన్‌లో 747,350కి చేరిన వాహనాలు
- ఏప్రిల్‌లో QR7.56bn లావాదేవీలు
- 350 దిర్హామ్‌ల ఎయిర్ టాక్సీ రైడ్లు
- భారత్‌కు మరో దౌత్య విజయం
- ‘జగన్ 2.0 ప్రచారం జోష్..’: వాడ వాడల్లో స్టార్ క్యాంపెయినర్లు
- ఎన్నికల వేళ TSRTC ప్రత్యేక బస్సులు..
- తెలంగాణ మోడల్ స్కూళ్లలో ఇంటర్ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!