నైజర్:ఆర్మీ క్యాంప్‌లపై టెర్రర్ ఎటాక్...

నైజర్:ఆర్మీ క్యాంప్‌లపై టెర్రర్ ఎటాక్...

సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకు ఉగ్రవాదులు భీకర దాడులు జరపడంతో.. 71 మంది సైనికులు ప్రాణాలు విడిచారు. మరో 12 మంది సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నైజీరియాలోని నైజర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. తిల్లబెరి ప్రాంతంలో మంగళవారం రాత్రి.. వందల సంఖ్యలో ఉగ్రవాదులు.. ఆర్మీ బేస్ క్యాంపులపై దాడికి దిగారు. అలర్ట్ అయిన సైన్యం కూడా.. ఉగ్రవాదులను ప్రతిఘటించింది. ఈక్రమంలో కొందరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అయితే మోర్టార్లు, రాకెట్ లాంచర్లతో వందలమంది ఉగ్రవాదులు దాడులకు దిగడంతో.. 71 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. మరికొందరి ఆచూకి లభ్యం కాలేదు. తీవ్ర గాయాలపాలైన సైనికులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య దాదాపు మూడు గంటల పాటు.. భీకర కాల్పులు జరిగాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు తామే బాధ్యత వహిస్తున్నట్లు ఐసీస్ ప్రకటించుకుంది. ప్రస్తుతం ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో రెడ్ అలర్ట ప్రకటించారు.
ఇదిలా ఉంటే… గతవారం పశ్చిమ తహౌ ప్రాంతంలో కూడా సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Back to Top