దుబాయ్: ఇండియన్ స్కూల్ సీఈవో మార్పు

దుబాయ్: ఇండియన్ స్కూల్ సీఈవో మార్పు

దుబాయ్ లోని ఇండియన్ హైస్కూల్ తన సీఈఓను మార్చుతూ అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. సుదీర్ఘకాలంగా సీఈఓ పదవిలో కొనసాగుతున్న అశోక్ కుమార్ స్థానంలో ఎం.కే. వాసు పునీత్ ను కొత్త సీఈఓ నియమించబడ్డారు. దీనికి సంబంధించి విద్యార్ధుల తల్లిదండ్రులకు  స్కూల్ మేనేజ్ మెంట్ గురువారం మేసేజ్ పించింది. ఇటీవలె స్కూల్ చైర్మన్ గా నియమింపబడిన గిరిష్ జెత్వాని మాట్లాడుతూ కుమార్ సీఈఓ బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యారని ప్రకటించారు. అయితే..ఇందుకు గల కారణలను మాత్రం ఆయన వెల్లడించలేదు. కొత్త సీఈఓ వాసు స్కూల్ పూర్వ విద్యార్ధి కావటం విశేషం.

23 ఏళ్ల పాటు స్కూల్ సీఈఓ బాధ్యతలు నిర్వహించిన కుమార్..ఇప్పటివరకు ఎన్నో అవార్డులు అందుకున్నారు. విద్యార్ధుల కోసం ఆయన చేసిన క్రుషికిగాను అవార్డు అందుకున్న విద్యావేత కుమార్..స్కూల్ అకాడమీ బుక్స్ రచించారు. విద్యావేతగా ఎన్నో కీలక పదవులు చేపట్టారు. కంటెంట్ అడ్వైజర్ - వాట్ వర్క్స్ (నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ అథారిటీ, దుబాయ్), ఇంటర్నేషనల్ అసోసియేట్ ఇన్స్పెక్టర్, గ్రేటర్ గుడ్ సర్కిల్ సభ్యుడు, గల్ఫ్‌లోని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల కౌన్సిల్ వ్యవస్థాపక చైర్మన్ ఇలా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించారు. GESS ఎడ్యుకేషన్ అవార్డ్స్ 2019 లో “లైఫ్ టైం అచీవ్మెంట్” పురస్కారం అందుకున్నారు.

Back to Top