సౌదీ టాలెంట్‌కి అవార్డులు ప్రకటించిన కల్చరల్‌ మినిస్టర్‌

సౌదీ టాలెంట్‌కి అవార్డులు ప్రకటించిన కల్చరల్‌ మినిస్టర్‌

రియాద్‌: మినిస్టర్‌ ఆఫ్‌ కల్చర్‌ ప్రిన్స్‌ బదర్‌ బిన్‌ అబ్దుల్లా బిన్‌ ఫర్హాన్‌, నేషనల్‌ కల్చరల్‌ అవార్డ్స్‌ని ప్రకటించారు. 16 ప్రముఖ కల్చరల్‌ ఏరియాస్‌లో సౌదీ టాలెంట్స్‌ని ఈ సందర్భంగా గుర్తిస్తూ అవార్డులకు విజేతల్ని నిర్ణయిస్తారు. అవార్డులు ఆయా రంగాల్లో అత్యున్నత ఫలితాలు వచ్చేందుకు ఉపకరిస్తాయని ఈ సందర్భంగా మినిస్టర్‌ పేర్కొన్నారు. నాలుగు ట్రాక్‌లుగా అవార్డుల్ని విభజిస్తారు. పయోనీర్‌ అవార్డ్‌, యూత్‌ కల్చర్‌ అవార్డ్‌, కల్చరల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ అవార్డ్‌ మరియు ఫోర్త్‌ ట్రాక్‌. ఫోర్త్‌ ట్రాక్‌లో మొత్తం 11 అవార్డులు వుంటాయి. ఫిల్మ్‌ మరియు విజువల్‌ షో అవార్డ్‌, ఫ్యాషన్‌ అవార్డ్‌, మ్యూజిక్‌ అవార్డ్‌, నేషనల్‌ హెరిటేజ్‌ అవార్డ్‌, లిటరేచర్‌ అవార్డ్‌, థియేటర్‌ మరియు పెర్ఫామింగ్‌ అవార్డ్‌, విజువల్‌ ఆర్ట్స్‌ అవార్డ్‌, ఆర్కిటెక్చర్‌ మరియు డిజైన్‌ అవార్డ్‌, కలినరీ అవార్డ్‌, పబ్లిషింగ్‌ అవార్డ్‌ మరియు ట్రాన్స్‌లేషన్‌ అవార్డ్‌ ఇందులో వుంటాయి.

Back to Top