దుబాయ్: బస్సులో 20,000దిర్హామ్ లు..ఆ బస్సు డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?
- December 14, 2019
దుబాయ్:ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వ్యక్తికి కళ్ల ముందు నోట్ల కట్ట కనిపిస్తే ఏం చేస్తాడు? మనలో చాలా మంది గుట్టుచప్పుడు కాకుండా డబ్బు తీసుకొని ష్..గప్ చుప్ అనేస్తాం. కానీ, ఓ ఇండియన్ డ్రైవర్ మాత్రం తన నిజాయితీ చాటుకున్నాడు. తాను నడిపే బస్సులో 20 వేల దిర్హామ్ లు అతనికి దొరికినా..నిజాయితీగా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడు. దుబాయ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ బస్సు డ్రైవర్ పేరు అభిషేక్ నాథ్ గోవిందన్. దుబాయ్ ఆర్టీఏలో బస్సు డ్రైవర్. తన బస్సులో ఎవరో ప్రయాణికుడు మర్చిపోయిన 20,000 దిర్హామ్ లను తీసుకెళ్లి నైఫ్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ బ్రిగేడియర్ తారీఖ్ మొహమ్మద్ నూర్ కి అప్పగించాడు. డ్రైవర్ అభిషేక్ నిజాయికి హ్యాట్సఫ్ కొట్టిన పోలీసులు అతన్ని సన్మానించారు. అతని నిజాయితీని మెచ్చుకుంటూ ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ప్రజలు అభిషేక్ ను ఆదర్శంగా తీసుకోవాలని పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







