22ఏళ్లకే ఐపీఎస్ ఆఫీసర్!
- December 15, 2019
దేశంలోనే అత్యంత తక్కువ వయస్సులో ఐపీఎస్ ఆఫీసర్‌గా రికార్డు క్రియేట్ చెయ్యబోతున్నారు ఓ యువకుడు. గుజరాత్‌కు చెందిన ఆ యువకుడు 22ఏళ్లకే ఐపీఎస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం అయ్యారు.
గుజరాత్‌లోని పాలంపూర్ పట్టణం కనోదర్ గ్రామానికి చెందిన హసన్ సఫిన్.. గతేడాది యూపీఎస్సీ పరీక్షల్లో ఆల్‌ఇండియా స్థాయిలో 570 ర్యాంకు దక్కించుకున్నాడు. అనంతరం అతడు ఐపీఎస్ అధికారి పోస్టుకు ఎంపిక అయ్యాడు.
ఈ క్రమంలో శిక్షణ పూర్తి చేసుకున్న హసన్ డిసెంబర్ 23వ తేదీన జామ్‌నగర్ అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు చేపడుతున్నారు. దేశంలో ఇంత చిన్న వయస్సులో ఇటువంటి బాధ్యతలు అందుకున్న ఫస్ట్ వ్యక్తి హసన్ కావడం విశేషం.
ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంతో కష్టపడిన హసన్ అది కుదరకపోవడంతో ఐపీఎస్‌గా సేవలు చేసేందుకు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నాడు. హసన్ తల్లిదండ్రులు ముస్తఫా హసన్, నసీంభాను ఇద్దరూ ఓ వజ్రాల కంపెనీకి సంబంధించిన చిన్న యూనిట్‌లో పనిచేస్తుంటారు.
తాజా వార్తలు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్ 14 వచ్చేసింది..!!
- వరల్డ్ టాప్ 10 సురక్షితమైన దేశాలలో ఒమన్..!!
- కువైట్ లో "దిస్ ఈస్ యువర్ రోల్" ప్రారంభం..!!
- బహ్రెయిన్, ఇండియా మధ్య లీగల్, ట్యాక్స్ సహకారం..!!
- ఒమన్‌తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..