ఫ్యామిలీ ఫెయిర్‌ని ప్రారంభించిన సదరన్‌ గవర్నర్‌

- December 15, 2019 , by Maagulf
ఫ్యామిలీ ఫెయిర్‌ని ప్రారంభించిన సదరన్‌ గవర్నర్‌

బహ్రెయిన్‌: సదరన్‌ గవర్నరేట్‌లో ఫ్యామిలీ ఫెస్టివల్‌ ప్రారంభమయ్యింది. 16, 17 తేదీల్లో బహ్రెయిన్‌ నేషనల్‌ సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ ఈవెంట్‌ని ప్రారంభించారు. సదరన్‌ గవర్నర్‌ షేక్‌ ఖలీఫా బిన్‌ ఖలీఫా అల్‌ ఖలీఫా ఈ ఫ్యామిలీ ఫెయిర్‌ని బహ్రెయిన్‌ నేషనల్‌ స్టేడియం వద్ద ప్రారంభించడం జరిగింది. సీనియర్‌ అధికారులు, మీడియా అలాగే సిటిజన్స్‌ ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. నేషనల్‌ డే కార్యక్రమాలు ప్రజల్లో దేశభక్తిని మరింత పెంపొందిస్తాయని ఈ సందర్భంగా గవర్నర్‌ షేక్‌ ఖలీఫా చెప్పారు. ఈ సందర్భంగా కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫాకి గవర్నర్‌ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com