స్టోర్‌లోకి దూసుకెళ్ళిన కారు

- December 15, 2019 , by Maagulf
స్టోర్‌లోకి దూసుకెళ్ళిన కారు

బహ్రెయిన్‌: గలాలిలోని ఓ స్టోర్‌లో కారు ప్రమాదవశాత్తూ విధ్వంసం సృష్టించింది. ఈ ఘటనలో డ్రైవర్‌కి స్వల్పంగా గాయలయ్యాయి. స్టోర్‌ ఎంట్రన్స్‌ పూర్తిగా ధ్వంసమయినట్లు అధికారులు వెల్లడించారు. ఘటన గురించిన సమాచారం అందుకోగానే ట్రాఫిక్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారుని రివర్స్‌ చేస్తున్న సమయంలో అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా ఇనర్ధారించారు. మరో ఘటనలో. ఓ బహ్రెయినీ యంగ్‌స్టర్‌ ఈ ఘటనలో తృటిలో ఎలాంటి గాయాలూ కాకుండా బయటపడ్డాడు. అతని బైక్‌ పేవ్‌మెంట్‌లోకి దూరిపోయి, రెండు ముక్కలయ్యింది. చిన్నపాటి నిర్లక్ష్యాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com