పిల్లల భద్రతపై హెచ్చరిస్తూ వీడియో షేర్ చేసిన యూఏఈ పోలీసులు
- December 16, 2019
అపార్ట్ మెంట్లు, ఎత్తైన భవనాల్లో ఉండే కుటుంబాలు ఈ వింటర్ లో పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని యూఏఈ పోలీసులు ట్విట్టర్ ఖాతాలో హెచ్చరించారు. శీతాకాలపు గాలుల కోసం కిటీకీలను తెరిచి ఉంచి నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దని సూచించారు. కిటీకీలను, బాల్కనీ డోర్లను తెరిచి ఉంచడం వల్ల పిల్లలు ఎత్తైన భవనాల నుంచి కింద పడే ప్రమాదం పొంచి ఉందని అధికారులు గుర్తు చేశారు. ఇంట్లోని చిన్నారుల సురక్షితం కోసం ఎల్లవేళలా వారితో పెద్దలు ఉండేలా జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.
ఇంట్లోకి చల్లగాలి రావాలని కిటికీలు, బాల్కానీ డోర్లు తెరిచి ఉంచి ఆదమరిస్తే ఆడుకునే పిల్లలు ప్రమాదవశాత్తు పడిపోయే అవకాశాలు ఉన్నాయంటూ ఓ వీడియోను షేర్ చేశారు పోలీసులు. ఈ మధ్యే షార్జాలో ఎనిమిదో అంతస్తు నుంచి ఓ చిన్నారి కింద పడిన ఘటనను ఇందుకు ఊదాహరణగా వెల్లడించించారు పోలీసులు. ప్రమాద సమయంలో ఆ చిన్నారి తల్లి వాష్ రూం వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఎనిమిదో అంతస్తు నుంచి కింద పడిపోయాడని, ఆ సమయంలో చిన్నారి తల్లి వాష్ రూంకి వెళ్లిందని తెలిపారు. గత మూడేళ్లలోనే దాదాపు 15 మంది పిల్లలు ఇలా ఎత్తైన భవనాలపై నుంచి చనిపోయినట్లు పోలీసులు వివరించారు. వాళ్లంతా రెండేళ్ల నుంచి 10 ఏళ్ల వయస్సులోపు వారే.
పెద్దల పర్యవేక్షణ లేని సమయాల్లో పిల్లలు ప్రమాదం బారిన పడకుండా కిటికీలు, బాల్కానీ డోర్లను లాక్ చేయాలని పోలీసులు సూచించారు. అలాగే కిటీకీలకు నాణ్యమైన గ్రిల్స్ చేయించుకోవాలని, అవసరమైనప్పుడు వాటిని తీసివేసేలా లేదంటే ఓపెన్ చేసేలా అమర్చుకోవాలన్నారు. బాల్కనీలో
ఫర్నిచర్ వస్తువులు ఏమి పెట్టొద్దని పెద్ద పిల్లలు కూడా ఫర్నిచర్ ఎక్కబోయి కింద పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







