షార్జా: ఖోర్ ఫక్కన్ లో ఫ్యామిలీ బీచ్ ప్రాజెక్ట్ ప్రారంభం
- December 16, 2019
యూ.ఏ.ఈ:ఖోర్ ఫక్కన్ సముద్ర తీరం మరింత అహ్లాదకరంగా, ఆటవిడుపు ఆకర్షణలతో షార్జా వాసులకు స్వాగతం పలుకుతోంది. వాటర్ స్పోర్ట్స్, ఇసుక కోట సైకత శిల్పాలతో రూపుదిద్దుకున్న కొత్త బీచ్ ప్రాజెక్ట్ ను షేక్ డాక్టర్ సుల్తాన్ బిన్ ముహమ్మద్ అల్ ఖాసిమి ఆదివారం ప్రారంభించారు. షార్జా ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్‌పర్సన్ షేఖా బోడోర్ బింట్ సుల్తాన్ అల్ ఖాసిమి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ ఫ్యామిలీ బీచ్ పార్క్ లో జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, మల్టి స్పోర్ట్స్ కోర్ట్స్, స్విమ్మర్స్ బీచ్ తో పాటు పిల్లల కోసం ప్లేయింగ్ ఏరియా సౌకర్యాలను అభివృద్ధిచేశారు. పూర్తి పర్యావరణహితంగా రూపొందించిన ఈ బీచ్ లో షోకేస్ ఆర్ట్, మురల్స్ (కుడ్యచిత్రాలు) అదనపు ఆకర్షణ. బీచ్ ప్రాజెక్ట్ ఎక్స్ పీరియన్స్ ని ఎంజాయ్ చేయాలనుకునే సందర్శకులకు ఇటీవలె వేసిన షార్జా-ఖోర్ ఫక్కన్ హైవే పై వెళ్తే 45 నిమిషాల్లో బీచ్ కు చేరుకోవచ్చు.
బీచ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన షేక్ సుల్తాన్ అక్కడి బోట్ రేసుతో పాటు ప్రఖ్యాత ఎమారైటి కళాకారుడు మొహమ్మద్ అల్ అస్తాద్ వేసిన ఆర్ట్ గ్యాలరీని సందర్శించారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!