దుబాయ్:మహిళపై అత్యాచారయత్నం..ముగ్గురు అరెస్ట్
- December 16, 2019
దుబాయ్:ఓ మహిళపై ముగ్గురు యువకులు అత్యాచారయత్నానికి ఒడిగట్టిన కేసు దుబాయ్ కోర్టు ఆఫ్ ఫస్ట్ ఇన్స్టెన్స్ లో సోమవారం విచారణకు వచ్చింది. దుబాయ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ కు చెందిన 35 ఏళ్ల యువకుడికి 22 ఏళ్ల మొరాకో యువతితో వాట్సాప్ పరిచయం ఏర్పడింది. ఆ ఇద్దరు గత అక్టోబర్ లో మురాఖాబాద్ లోని ఓ చోట డిన్నర్ కు కలుసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ మేరకు తాను మురఖాబాద్ కు చేరుకోగానే ఆ యువకుడు తనను అతని అఫీస్ కు తీసుకెళ్లినట్లు మొరాకో యువతి తెలిపింది.
ఆఫీస్ లో మరో ఇద్దరు స్నేహితులు పరిచయం చేసిన పాకిస్తానీ..తాను ఫుడ్ తీసుకురావటానికని బయటికి వెళ్లాడని ఆమె వెల్లడించింది. ఆ సమయంలో తనతో పాటే ఉన్న మరో వ్యక్తి అతనితో అఫైర్ పెట్టుకోవాలని బలవంత పెట్టాడని, తాను తిరస్కరించటంతో అతను తనపై దాడికి పాల్పడినట్లు బాధితురాలు చెబుతోంది. 43 ఏళ్ల వ్యాపారవేత్త తన వివస్త్రను చేసి మరో అఫీస్ రూంలో తనపై అఘాయిత్యానికి ఒడిగనట్లు ఆవేదన వ్యక్తం చేసింది. తాను స్పృహలోకి రాగానే మూడో నిందితుడు కారు బుక్ చేసి తనను ఇంటికి పంపించినట్లు బాధితురాలు వాంగ్మూలం ఇచ్చింది.
" నాపై జరిగిన దాడి గురించి బంధువుకు చెప్పాను. రిలేటీవ్ ఇచ్చిన సలహాతో అఘాయిత్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాను. వాట్సాప్ లో పరిచయమైన వ్యక్తి ఈ దారుణానికి ప్లాన్ చేయగా, రెండో వ్యక్తి నాపై అటాక్ చేశాడు. మూడో నిందితుడు అఫీస్ రూం డోర్ ను వెలుపలి నుంచి లాక్
చేశాడు" అని బాధితురాలు వెల్లడించింది.
బాధితురాలి ఫిర్యాదుతో ఆ ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అఘాయిత్యానికి పాల్పడిన 43 ఏళ్ల పాకిస్తానీపై అత్యాచార అభియోగం కేసు నమోదు చేయగా..మిగిలిన ఇద్దరిపై నేరానికి సహాయం చేసినట్లుగా కేసు ఫైల్ చేశారు. ఈ కేసును సోమవారం విచారించిన దుబాయ్ కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 29కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







