26న తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత

- December 16, 2019 , by Maagulf
26న తిరుమల, శ్రీశైలం ఆలయాల మూసివేత

తిరుమల, శ్రీశైలం: సూర్య గ్రహణం కారణంగా ఈనెల 26న తిరుమల, శ్రీశైలం ఆలయాలు మూతపడనున్నాయి. 13 గంటలపాటు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు తితిదే అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 25న రాత్రి 11 గంటల నుంచి 26 మధ్యాహ్నం 12 వరకు ఆలయాన్ని మూసివేయనున్నారు. దీంతో పాటు వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం కూడా మూతపడనుంది. ఈ నేపథ్యంలో 26న తిరుమలలో ఆర్జిత సేవలు రద్దు కానున్నాయి.

శ్రీశైలంలోనూ..
గ్రహణం కారణంగా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల ద్వారాలను మూసివేస్తునట్టు దేవస్థానం ఈవో రామారావు తెలిపారు. గ్రహణం రోజు ఉదయం 11.30 గంటల వరకు ఆలయం మూసివేయనున్నట్టు ఆయన చెప్పారు. ఆ తర్వాత ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ పూజలు నిర్వహించనున్నట్టు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు భక్తులను స్వామివారి దర్శనానికి ఆలయంలోకి అనుమతించనున్నట్టు తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి భక్తులు అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించుకోవచ్చన్నారు. గ్రహణం కారణంగా ప్రధాన దేవాలయంతో పాటు ఉప ఆలయాలైన సాక్షి గణపతి, శిఖరేశ్వరం, హటకేశ్వరం ఆలయాలను మూసివేస్తునట్టు ఈవో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com