యూఏఈ: యాడ్స్ పై 5% VAT విధించనున్న ఫేస్ బుక్

- December 17, 2019 , by Maagulf
యూఏఈ: యాడ్స్ పై 5% VAT విధించనున్న ఫేస్ బుక్

యూఏఈ:సోషల్ మీడియా వేదికగా యాడ్స్ సేల్స్ జరిపే అకౌంట్ హోల్డర్లకు ఫేస్ బుక్ షాకిచ్చింది. ఇక నుంచి అలాంటి కమర్షియల్ యాడ్స్ పై 5 శాతం వ్యాట్ విధించనున్నట్లు ప్రకటించింది. యూఏఈలో వ్యాట్ అమలులోకి రావటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్ బుక్ తన యూజర్లకు నోటీసు ద్వారా తెలిపింది. యూఏఈలోని ఫేస్ బుక్ అకౌంట్ హోల్డర్లు ఫేస్ బుక్ వేదికగా తమ ప్రొడక్ట్స్ సేల్స్ చేసే అన్ని రకాల ప్రకటనలపై 5% వ్యాట్ విధించనున్నట్లు వెల్లడించింది. యూఏఈ జారీ చేసే ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఫేస్ బుక్ అకౌంట్లో అప్ డేట్ చేయని ప్రకటనకర్తల అందరికీ ఇది వర్తించనుంది.

ఫేస్ బుక్ లో యాడ్ సేల్స్ వ్యాట్ పరిధిలోకి రాకుండా ఉండాలంటే వెంటనే ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ అప్ డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అకౌంట్ సెట్టింగ్స్ లోకి వెళ్లి మీ స్టేట్ యాడ్ లేదా కన్ఫమ్ చేయాలి. ఆ తర్వాత ట్యాక్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ 15 డిజిట్స్ అప్ డేట్ చేయాలి. అకౌంట్ హోల్డర్లు అప్ డేట్ చేసిన నెంబర్ ను యూఏఈ ట్యాక్స్ అథారిటీ నుంచి ఫేస్ బుక్ నిర్వాహకులు వెరిఫై చేసుకుంటారు. తప్పుగా నెంబర్ అప్ డేట్ చేస్తే ఆ అకౌంట్ హోల్డర్ ప్రకటన ద్వార జరిపే అమ్మకాలపై 5 శాతం వ్యాట్ విధించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com