గోల్డ్ వీసా అప్లై చేసుకునేందుకు వెబ్ సైట్ లాంచ్ చేసిన యూఏఈ
- December 17, 2019
యూఏఈ లో బిజినెస్, రీసెర్చ్ చేయాలనుకునేవారికి వీసా అప్లికేషన్ల విషయంలో యూఏఈ మరింత సులభతరం చేసింది. గోల్డ్ కార్డ్ వీసా అప్లికేషన్ల కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ & సిటిజన్ షిప్ ప్రత్యేకంగా వెబ్ సైట్ లాంచ్ చేసింది. యూఏఈలో ఉండేందుకు లాంగ్ టర్మ్ వీసా పొందాలనుకునే ఎంటర్ ప్రెన్యూర్స్, ప్రొఫెషనల్ టాలెంట్స్, రీసెర్చర్స్ ఈ వెబ్ సైట్ ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు.
https://business.goldenvisa.ae యూఆర్ఎల్ అడ్రస్ ద్వారా యూఏఈ గోల్డ్ వీసాకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అధికారులు అప్లికేషన్ల అర్హతను చెక్ చేసి ఉన్నతాధికారులకు ప్రాసెస్ చేస్తారు. వీసా జారీలో పారదర్శకత ఉండేలా సంబంధిత అధికారులు అందరూ దరఖాస్తు స్టేటస్ ను చెక్ చేయవచ్చు. బిజినెస్, రీసెర్చ్ రంగాల్లో యూఏఈలో ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకొని మెరుగైన భవిష్యత్తుకు బాటలు వేసేలా గోల్డ్ కార్డ్ వీసా ప్రతిభావంతులకు దోహదం చేస్తుంది. "గోల్డ్ రెసిడెన్సీ వీసా, గోల్డ్ కార్డ్" పొందినవారు 5 నుంచి 10 ఏళ్ల వరకు యూఏఈలో ఉండేందుకు అనుమతి ఉంటుంది. వీసా హోల్డర్ ఫ్యామిలి మెంబర్స్ కి కూడా ఈ వీసా వర్తిస్తుంది. గోల్డ్ కార్డ్ వీసా ప్రాసెస్ గత మే 21 నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాదిలో 6,800ల గోల్డ్ కార్డ్ వీసాలను ఇవ్వాలని జనరల్ డైరెక్టరేట్ రెసిడెన్సీ & ఫారెనర్స్ అఫైర్స్ లక్ష్యంగా నిర్దేశించుకుంది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..