ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు:జగన్
- December 17, 2019
అమరావతి: చుట్టూ భూములు కొనుగోలు చేసి రాజధాని ప్రాంతాన్ని ప్రకటించారని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి రూ.లక్షా 9వేలు కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.5,800 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. దీనిపై వడ్డీయే ఏటా రూ.700కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని.. ఇంకా రూ.లక్ష కోట్లు ఎక్కడి నుంచి తీసుకురావాలని ప్రశ్నించారు. శాసనసభలో రాజధానిపై జరిగిన చర్చలో సీఎం మాట్లాడారు. ప్రతిపాదనలు చూస్తుంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.16వేల కోట్లు, ఇంటింటికీ తాగునీటి కోసం రూ.40వేల కోట్లు ఖర్చవుతోందన్నారు. పాఠశాలలు, ఆస్పత్రులను బాగుచేయడానికి రూ.30వేల కోట్లు.. రాజధాని పరిధిలోని 20కి.మీ పరిధిలో ఉన్న భూములను అభివృద్ధి చేయాలంటే రూ.లక్ష కోట్లు అవసరమని సీఎం వివరించారు. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలి? ఆర్థిక పరిస్థితేంటి? అనే అంశంపై ఆలోచన చేయాల్సిన అవసరముందన్నారు.
‘‘ఈ పరిస్థితుల్లో వేసే ప్రతి అడుగూ ఆలోచించే వేయాలి. ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు చెప్పినట్లు అభివృద్ధి వికేంద్రీకరణ మంచి ఆలోచన. మనం కూడా మారాలి. దక్షిణాఫ్రికా లాంటి దేశంలో మూడు రాజధానులు ఉన్నాయి. అమరావతిలో శాసన నిర్వాహక, విశాఖలో కార్యనిర్వాహక, కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. ఇలాంటి ఆలోచనలు కూడా చేయాల్సిన అవసరముంది. బహుశా మన రాష్ట్రానికీ మూడు రాజధానులు వస్తాయేమో. లెజిస్లేటివ్ క్యాపిటల్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్ వస్తాయేమో. ఆ పరిస్థితి కనిపిస్తోంది. మన దగ్గర డబ్బు ఉండే పరిస్థితి ఉందా? అని ఆలోచించాల్సిన అవసరముంది. విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడితే అక్కడ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖర్చేమీ ఉండదు. ఇలాంటి ఆలోచనలు సీరియస్‌గా చేయాల్సిన అవసరముంది. అందుకే ఓ కమిటీని వేశాం. ఆ కమిటీ స్టడీ చేస్తోంది. బహుశా వారంలోపు ఆ నివేదిక వస్తుంది. ఏం చేయాలనేదానిపై ఆ కమిటీ నివేదికలో వివరిస్తారు’’ అని జగన్ అన్నారు.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!