యూఏఈ బ్రాండ్ లోగో ఎంపిక కోసం ఆన్ లైన్ ఓటింగ్
- December 18, 2019
యూఏఈ ఇమేజ్ చాటిచెప్పేలా లోగో సెలక్ట్ చేసే పనిలో ఉంది ప్రభుత్వం. ఈ లోగో ఎంపికలో మీరు కూడా భాగస్వామ్యం కావొచ్చు. మీరు ఎంపిక చేసే లోగో రాబోయే 50 ఏళ్లు యూఏఈ బ్రాండ్ కు చిహ్నంగా ఉండబోతోంది. లోగో ఎంపిక కోసం యూఏఈ వాసులు ఆన్ లైన్ ఓటింగ్ లో పాల్గొని బెస్ట్ లోగోను ఎంపిక చేస్తే సరిపోతుంది. ఎక్కువ ఓట్లు పొందిన లోగోను ఫైనల్ చేస్తారు. యూఏఈ బ్రాండ్ సూచించేలా మూడు లోగో డిజైన్లకు ఆన్ లైన్ లో ఓటింగ్ చేపట్టారు. ప్రజలు ఓటింగ్ లో పాల్గొనేందుకు www.nationbrand.ae వెబ్ సైట్ ను లాంచ్ చేశారు. యూఏఈ ప్రధాని 'షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూం' ఈ వెబ్ పోర్టల్ ను ప్రారంభించారు. యూఏఈ ప్రతిష్టను చాటేలా లోగోను ఎంపిక చేసేందుకు ప్రజలు ఓటింగ్ లో పాల్గొనాలని షేక్ మొహమ్మద్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







