తెలంగాణ:హజ్ దరఖాస్తులకు 23 వరకు గడువు

- December 18, 2019 , by Maagulf
తెలంగాణ:హజ్ దరఖాస్తులకు 23 వరకు గడువు

హైదరాబాద్ : హజ్‌యాత్రకు వెళ్లేవారి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు తేదీని ఈ నెల 23 వరకు పొడిగించినట్టు హజ్‌కమిటీ చైర్మన్ మహ్మద్ మసిఉల్లాఖాన్ పేర్కొన్నారు. ముంబైలోని భారత హజ్‌కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నదని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకొనేటప్పుడు పాస్‌పోర్టు, బ్యాంకు అడ్రస్, చిరునామాకు సంబంధించిన ఆధారాలు, ఫొటోలుసహా పత్రాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు telanganastatehajcommittee.com ను సంప్రదించాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com