ఇస్లాంను కించపరిచిన జోర్డన్ వ్యక్తి..డిసెంబర్ 31న శిక్ష ఖరారయ్యే ఛాన్స్

- December 18, 2019 , by Maagulf
ఇస్లాంను కించపరిచిన జోర్డన్ వ్యక్తి..డిసెంబర్ 31న శిక్ష ఖరారయ్యే ఛాన్స్

భార్యను బెదిరించి ఇస్లాంను కించపరిచినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తి కేసు దుబాయ్ కోర్టులో విచారణకు వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న జోర్డాన్ వ్యక్తి మనస్పర్థలతో కొన్నాళ్లుగా భార్యకు దూరంగా ఉంటున్నాడు.  ఆ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తొలిగిపోకపోవటంతో అతను భార్యను బెదిరించటమే కాకుండా దైవ దూషణ చేస్తూ వాట్సాప్ లో మేసేజ్ పంపించినట్లు ప్రాసిక్యూషన్ అధికారులు వెల్లడించారు. తనను, తన ఫ్యామిలి మెంబర్స్ ని సజీవదహనం చేస్తానని బెదిరించినట్లు బాధితురాలు చెబుతున్నారు. గత ఏప్రిల్ 29న అల్ రషిదియా పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయటంతో కేసు నమోదైంది.

భర్తకు దూరంగా ఉంటున్న బాధితురాలు ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే..భర్త వేధింపులతో తాను ఎంతటి నరకాన్ని అనుభవించిందో ప్రాసిక్యూషన్ ఇన్వెస్టిగేషన్ సమయంలో రుజువులతో సహా అధికారులకు వివరించారు. తనను, తన కుటుంబసభ్యులను పరుష పదజాలంతో తిట్టడంతో పాటు ఇస్లాంను కించపరిచేలా దైవ దూషణకు పాల్పడినట్లు బాధితురాలు ఇన్వెస్టిగేషన్ అధికారులకు తెలిపారు. వాట్సాప్ మేసేజ్ కాపీలను కూడా తన కేస్ ఫైల్ జత చేశారు. ఈ కేసులో నిందితుడికి డిసెంబర్ 31న దుబాయ్ కోర్టు శిక్ష  ఖరారు చేయనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com