యూఏఈ: అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..150 కుటుంబాల తరలింపు
- December 18, 2019
యూఏఈలోని ఫుజైరహ్ లో అగ్నిప్రమాదం సంభవించింది. అల్ ఖైల్ అపార్ట్మెంట్ బిల్డింగ్ లో మంగళవారం రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల నుంచి సమచారం అందుకున్న సివిల్ డిఫిన్స్ అధికారులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించారు. ప్రమాదం చోటుచేసుకున్న ప్రాంతంలో 48 అపార్ట్మెంట్ భవనాలు ఉన్నాయి. దీంతో మంటలు చుట్టుపక్కల బిల్డింగ్ లకు వ్యాపించకముందే భవనాల్లోని 150 కుటుంబాలను అగ్నిమాపక సిబ్బంది అక్కడ్నుంచి తరలించింది. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అపార్ట్మెంట్ ఏడో అంతస్తులోని కిచెన్ నుంచి మంటలు చెలరేగినట్లు ఫుజైరహ్ సివిల్ డిఫెన్స్ డైరెక్టర్ ఖలీద్ అల్ హమౌదీ తెలిపారు. మంటలు వేగంగా ఇతర గదులకు విస్తరించటంతో వస్తువులు తగలబడినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదాల సమయాల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టాన్ని నివారించేందుకు బిల్డింగ్ యజమానులు అగ్నిమాపక శాఖ సూచనలను పాటించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







