సంతానం కోరుకునే జంట రెగ్యులర్‌గా పైనాపిల్ తింటే...

- December 19, 2019 , by Maagulf
సంతానం కోరుకునే జంట రెగ్యులర్‌గా పైనాపిల్ తింటే...

ప్రకృతి ప్రసాదించిన ఫలాలలో అనాస పండు ఒకటి. దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పుల్లపుల్లగా తీయ తీయగా ఉండే వీటిల్లో విటమిన్లు, పోషకాలు ఎక్కువుగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో జీరో ఫ్యాట్, జీరో కొలెస్ట్రాల్, పుష్కలంగా విటమిన్ ఏ, బి, సీ, పొటాషియమ్, మాంగనీస్, కాపర్ ఉంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే మనకు రోజు మెుత్తంలో అవసరమైన విటమిన్ సి లభించినట్లే. దీనితో రోగ నిరోధక శక్తి బాగా పుంజుకుంటుంది. అనాసపండులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.

1. అనాసపండులో కణజాలం వృద్ధి చెందటానికి, కణాల మరమత్తుకు అవసరమయ్యే విటమిన్ సి ఎక్కువుగా ఉపయోగపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు కణాలకు త్వరగా వృద్దాప్యం రాకుండా, క్యాన్సర్, గుండె జబ్బువంటి జబ్బులు దరిచేరకుండా చూస్తాయి. అంతేకాకుండా పైనాపిల్ బరువు తగ్గటానికి తోడ్పడుతుంది.

2. సంతానం కోరుకునే జంట రెగ్యులర్‌గా పైనాపిల్స్ తినడం వల్ల.. పునరుత్పత్తి వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తుంది. విటమిన్ సీ, బీటా కెరోటిన్, కాపర్, మినరల్స్ సంతానోత్పత్తికి తోడ్పడతాయి.

3. పైనాపిల్ తినటం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. దీనిలోని బ్రొమెలనిన్ అనే ఎంజైము ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడుతుంది. ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి ఎక్కువ తినకుండా చూస్తుంది. అలాగే మలబద్దకం దరి చేరకుండా చేస్తుంది.

4. సైనస్, అలర్జీలతో బాధపడే వాళ్లకు పైనాపిల్ చక్కటి పరిష్కారం. ఇందులో ఉండే పోషకాలు.. గొంతు, ముక్కులో ఉండే శ్లేష్మంను అరికడుతుంది. ఒకవేళ సీజనల్ అలర్జీలు ఉంటే.. పైనాపిల్స్‌ని డైట్లో చేర్చుకోవచ్చు.

5. దగ్గు, జలుబు నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి పైనాపిల్ బాగా ఉపయోగపడుతుంది. శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం. కాబట్టి ఎప్పుడైనా జబులు, దగ్గు వచ్చాయంటే.. ఒక గ్లాసు పైనాపిల్ జ్యూస్ తాగితే వెంటనే రిలాక్స్ అయిపోతారు.

6. మొటిమలతో బాధపడుతున్నప్పుడు పైనాపిల్ రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. విటమిన్‌తో పాటు.. ఎంజైమ్స్ ఉండటం వల్ల.. జ్యూస్‌లాగా తీసుకున్నా మంచిది.. ఫేస్ ప్యాక్‌లా వేసుకున్నా.. మొటిమల నుంచి ఉపశమనం కలుగుతుంది. కొద్దిగా పసుపు తీసుకుని.. పైనాపిల్ పేస్టులో కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల.. మొటిమలు తగ్గిపోతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com