అమరావతిలో 144, 34 సెక్షన్లు విధించిన పోలీసులు

- December 19, 2019 , by Maagulf
అమరావతిలో 144, 34 సెక్షన్లు విధించిన పోలీసులు

అమరావతి:జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రగులుతున్న రాజధాని మార్పు రగడ తాజాగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఒక రాజధాని కాదు మూడు రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ఒక్కసారిగా భగ్గుమంది. రాష్ట్రంలో 3 రాజధానిల ఏర్పాటుపై విపక్ష పార్టీలన్ని సర్వత్రా విమర్శలు గుప్పిస్తున్నాయి. అటు రాజధాని రైతులు కూడా జగన్ ప్రకటించిన నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు పంటలు పండి సుభిక్షంగా ఉండే భూములను రాష్ట్రం బాగు పడాలని రాజధాని నిర్మాణం కోసం మేము త్యాగం చేస్తే ఇప్పుడు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం దారుణమని అమరావతి రైతులు అందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా నేడు అమరావతి రైతులందరూ బందుకు పిలుపునిచ్చారు.. దీంతో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా రాజధాని అమరావతిలో పోలీసులు 144 సెక్షన్ 34 సెక్షన్ విధించారు. ఈ మేరకు తుళ్లూరు డి.ఎస్.పి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అలర్ట్ గా ఉన్నారని తెలిపారు. రైతులు తమ ఆందోళనలను శాంతియుతంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని ఆయన కోరారు. చట్టాన్ని ఉల్లంఘించి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పి హెచ్చరించారు. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మూడు రాజధానిలో నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నేడు అమరావతి రైతులందరూ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ 34 సెక్షన్ విధించగా..ఈ నేపథ్యంలో పాఠశాలలు వ్యాపార సంస్థలు ప్రభుత్వ కార్యాలయాలు స్వచ్ఛందంగా మూతపడుతున్నాయి.


తమ ఆందోళనలో భాగంగా అమరావతి రైతులు కూలీలు వెలగపూడి లో రిలే నిరాహార దీక్షను ప్రారంభించనున్నారు 29 గ్రామాల్లోని ఆయా గ్రామ సచివాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించనున్నారు అమరావతి రైతులు. ఇకపోతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించిన 3 రాజధానిల నిర్ణయంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విశాఖపట్నం కర్నూలు అమరావతి లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ ఎంతైనా అవసరమని అందుకే తమ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుందని అసెంబ్లీ వేదికగా తెలిపారు జగన్ మోహన్ రెడ్డి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com