పోర్టులతో దుబాయ్ ని లింక్ చేస్తూ కీలక రైల్వే లైనుకు గ్రీన్ సిగ్నల్
- December 19, 2019
యూ.ఏ.ఈ:వాణిజ్య నగరం దుబాయ్ తో ఫుజైరహ్, ఖర్ఫాఖాన్ పోర్టులను కలుపుతూ కొత్త రైల్వే లైను టెండర్ ను ఎతిహద్ రైల్వే బోర్డు ఆమోదించింది. 4.6 బిలియన్ దిర్హామ్ లతో స్టేజ్ 2లోని ప్యాకేజీ డీలో సివిల్ వర్క్ పనులు చేపట్టేందుకు టెండర్ ఖరారు చేసింది. యూనైటెడ్ అరబ్ కంట్రీస్ లో అతిపెద్ద కమర్షియల్ క్యాపిటల్ సిటీ దుబాయ్ ని పోర్టులకు లింక్ చేయటంతో ఎక్స్ పోర్ట్స్, ఇంపోర్ట్స్ గూడ్స్ రవాణా మరింత సులువు కానుంది. ఈ రైలు మార్గాన్నిఎమిరాతిలతో అనుసంధానం చేయటం ద్వారా ఏడాదికి దాదాపు 2మిలియన్ల కంటైనర్ల సరుకు రవాణా జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ ట్రేడ్ ప్రమోషన్ కు ఈ కొత్త రైల్వే లైను దోహదం చేయనుంది. అందుకే ఈ ప్రాజెక్ట్ ను ఎమిరాతి పాలకులు కీలకంగా భావిస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







