అమెజాన్ లో ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్
- December 19, 2019
అమెజాన్ లో ఫ్యాబ్ ఫోన్ ఫెస్ట్ మొదలు అయ్యింది. నేటి నుంచి మొదలు ఐనా ఈ ఫోన్ల పండుగ డిసెంబర్ 23 వరకు కొనసాగుతుంది. ఈ ఫెస్ట్ లో అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లపై 40 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు అమెజాన్ తెలియచేయడం జరిగింది. సాధారణంగా ఈ స్మార్ట్ ఫోన్లపై అందుబాటులో ఉండే డిస్కౌంట్లతో పాటు నో కాస్ట్ ఈఎంఐ, ఎక్స్ చేంజ్ ఆఫర్, ఉచితంగా స్క్రీన్ రీప్లేస్ మెంట్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.750 తగ్గింపు ఆఫర్లు కూడా ప్రకటించింది అమెజాన్ .
ఇక ఈ ఫెస్ట్ లో అత్యుత్తమ డిస్కౌంట్లు ఉన్న ఫోన్ల వివరాలు చూద్దామా మరి...ఈ ఫెస్ట్ లో ఈ ఫోన్లు పోటా పోటీగా నిలుస్తున్నాయి. వన్ ప్లస్ 7 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం30, ఐఫోన్ XR , రెడ్ మీ కే20 ప్రో, నోకియా 4.2. ఫోన్లకు భారీ డిస్కౌంట్లను ప్రకటించడం జరిగింది. ఇక వన్ ప్లస్ 7 ప్రో స్మార్ట్ ఫోన్ పై అత్యధిక తగ్గింపు ఇవ్వడం జరిగింది.
సాధారణంగా రూ.52,999 విలువైన ఈ ఫోన్ ఈ సేల్ లో భాగంగా రూ.42,999కే ఇస్తుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎం30 స్మార్ట్ ఫోనే సాధారణంగా రూ.14,999 విలువైన ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.5,000 తగ్గింపును ఇస్తుంది. దీంతో ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ రూ.9,999కే అందుబాటులోకి తీసుకోని రావడం జరిగింది. ఇక వీటితో పాటు అందుబాటులో ఉన్న బ్యాంక్ ఆఫర్ల ద్వారా కొనుగోలు చేస్తే మరింత ఆఫర్ లభించే అవకాశలు కూడా ఉన్నాయి. ఇక ఐఫోన్ XR ఫోన్ లాంచ్ అయినప్పుడు దీని ధర రూ.76,900 కాగా, ఐఫోన్ 11 విడుదల చేసిన తర్వాత రేటుని రూ.49,900కు తగ్గించడం జరిగింది.
ప్రస్తుతం ఈ సేల్ లో దీన్ని మరింత తగ్గించి రూ.45,900కే అందుబాటులో ఉంచడం జరిగింది. ఇలా సేల్ లో ఉన్న అన్ని ఫోన్లకు భారీ డిస్కౌంట్లను ప్రకటించడం జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన ఫోన్ కొనండి భారీ డిస్కౌంట్ పొందండి.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







